![]() |
![]() |
.webp)
ఇన్నాళ్లు అలరించిన ఢీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి వచ్చింది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చారు. ఆయన మూవీస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి కూడా ఏ షోకి వచ్చిన అక్కడ నవ్వులు పూయిస్తారు. ఇక ఈ షోలో ఆది, అనిల్ ఇద్దరి కామెడీ డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి ఎంట్రీ వెరైటీగా ఉంది. కుర్చీలో కూర్చుని పక్కన రెండు సింహాలను పెట్టుకుని స్టేజి మీదకు వచ్చారు.
ఈ దృశ్యాన్ని చూసిన ఆది కామెంట్ చేసాడు. "ఇంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు అంతా బాగుంది ఓకే...కానీ రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సింహానికి తెలిస్తే" అంటూ బాలయ్య పిక్ వేసేసరికి "చెప్తావా ఏంటి" అంటూ రివర్స్ డైలాగ్ వేసాడు అనిల్. దానికి కౌంటర్ గా "చూడడా ఏంటి" అన్నాడు ఆది. ఆ డైలాగ్ కి అనిల్ రావిపూడి తల వాల్చేసాడు. ఆ సీన్ చూసి శేఖర్ మాష్టర్ కిలకిలా నవ్వాడు. ఇక ఈ ఢీ ఫైనల్స్ కి ఆదర్శ్, వర్షిణి, శ్వేతా నాయుడు వచ్చారు. వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ మాములుగా లేవు. ఇంతకు గెలిచింది ఎవరు... టైటిల్ విన్ అయ్యింది ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ షోలో అనిల్ రావిపూడి- శేఖర్ మాష్టర్ ఇద్దరూ కలిసి చిరంజీవి సాంగ్ కి డాన్స్ చేశారు. విన్నర్ ఎవరు అన్న టెన్షన్ లో అందరూ ఉండగా ఆది కామెడీ వేరే రేంజ్ లో ఉంది. " ఇంత టెన్షన్ లో అడగొచ్చో లేదో కానీ మియ్యావ్ మియ్యావ్ పిల్లి ఆ డైలాగ్ చెప్పవా" అనేసరికి "నాకు మైక్ మడత పెట్టు అనాలనుంది" అని రివర్స్ కౌంటర్ వేసాడు అనిల్ రావిపూడి..
![]() |
![]() |